ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఆనాడు కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్నా.. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను 9 ఏళ్లలో ఏఒక్కటే చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష తీర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, కానీ, తెలంగాణ వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాలు ఏ ఒక్కటీ ప్రజలకు అందలేదని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ.. ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు.
Also Read : S** Harassment:‘మేడం మీ ఫిగర్ సూపర్’ అన్నా లైంగిక వేధింపే.. బీ కేర్ ఫుల్..
అన్ని రంగాల్లో విఫలమైన మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను గద్దె దించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని, అధికారులు బీఆర్‌ఎ్‌సకు తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వారే బీఆర్‌ఎస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. అయితే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలు రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ వారిలో చైతన్య నింపుతున్నారు.. అందుకు ఆయనను అభినందిస్తున్నానని జానారెడ్డి అన్నారు. ఆయన పాదయాత్రకు ప్రజలు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. అంతేకాకుండా.. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటిన తరువాత నల్గొండ జిల్లాలో కొనసాగతుందని.. నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్కతో పాదయాత్ర తాను పాల్గొంటానని వెల్లడించారు.
Also Read : KS Bharat: కేఎస్ భరత్‌పై నమ్మకం లేదు, అతని స్థానంలో ఆ కీపర్‌ని తీసుకోండి