Harbhajan Singh Wants Ishan Kishan In India Playing XI In WTC: ఈనెల 7వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సత్తా చాటాలని, ఫైనల్‌లో భారత జట్టుని గెలిపించుకోవాలని.. ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆస్ట్రేలియాతో పోరు అంత ఈజీ కాదు కాబట్టి, ఆ జట్టుకి ధీటుగా బదులివ్వాలన్న ఉద్దేశంతో కసరత్తు చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, టీమిండియా మేనేజ్‌మెంట్‌ని మాత్రం ఓ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. అదే.. ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. క్రీడా విశ్లేషకులు, మాజీలు తమతమ సలహాలు ఇస్తున్నారు.
Sugarcane Juice: చెరుకురసం తాగుతున్నారా? అయితే అస్సలు విడిచిపెట్టొద్దు!
ఇప్పుడు తాజాగా టీమిడియా మాజీ హర్భజన్ సింగ్ ఇదే విషయమై తన సలహా ఇచ్చాడు. కేఎస్ భరత్ కన్నా ఇషాన్ కిషన్‌ని తీసుకుంటేనే బెటరని అతను సూచించాడు. భరత్‌తో పోలిస్తే ఇషాన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 101 పరుగులే చేసిన భరత్‌పై అంత నమ్మకం కలగడం లేదని, అతని కంటే ఇషాన్ ధాటిగా బ్యాటింగ్ చేయగలడని, కాబట్టి ఇషాన్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించడమే ఉత్తమమైనదని చెప్పుకొచ్చాడు. ఇషాన్‌కు రిషభ్ పంత్‌లా అగ్రెసివ్‌గా ఆడే సామర్థ్యం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ.. ఇషాన్ ఇప్పటివరకు టెస్ట్ అరంగేట్రం చేయలేదన్న కారణం చూపి, అతడ్ని ఫైనల్ జట్టులోకి తీసుకోకపోతే మాత్రం అది జట్టుకే లాస్ అవుతుందని హెచ్చరించాడు. పైగా.. ఇషాన్ ఐపీఎల్ ముగిసే సమయంలో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని, అతడ్ని ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపితే, రెండో కొత్త బంతితో ఓ ఆట ఆడుకుంటాడని తెలిపాడు.
Shaitan Trailer: ఛీఛీ.. పచ్చి బూతులు.. పోర్న్ సినిమాలు తీసుకో పో
వికెట్‌కీపింగ్ విషయంలో తన ఓటు కేఎస్ భరత్‌కే అయినప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తాను ఇషాన్‌కే మద్దతు తెలుపుతానని హర్భజన్ అన్నాడు. కేవలం కీపింగ్ కోసం, ఓ బ్యాటర్‌ని కోల్పోవడం కరెక్ట్ కాదన్నాడు. ఫైనల్‌గా.. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌లో తన ఛాయిస్ ఇషానేనని చెప్పకనే చెప్పాడు. నిజానికి.. గతంలో భజ్జీ ఓసారి భారత వికెట్‌కీపర్‌గా కేఎస్ భరత్ బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటిది ఇప్పుడు అతను మాట మార్చడం గమనార్హం. మరి.. భజ్జీ సూచనని సెలెక్టర్లు కన్సిడర్ చేస్తారా? ఇషాన్‌ని బరిలోకి దింపుతారా? లేక భరత్‌కి ఛాన్స్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!