Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ & కాశ్మీర్
- తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ & కాశ్మీర్
- సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్‌ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్‌ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో నాల్గవ రోజు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌కు ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ విజయానికి నిజమైన హీరో ఆకిబ్ నబీ, ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు, అందులో మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కూడా ఉన్నాయి. అబ్దుల్ బ్యాటింగ్‌తో కూడా తన వంతు పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో అజేయంగా 30 పరుగులు చేసి జట్టు ఈ కీలకమైన విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు.
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
వాస్తవానికి ఫిబ్రవరి 16 సోమవారం వరకు జమ్మూ కాశ్మీర్, బెంగాల్ జట్ల మధ్య గట్టి పోటీగా భావించారు, ఫిబ్రవరి 17 మంగళవారం ఏకపక్ష పోరాటంగా మారింది. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్లు అకిబ్ నబీ దార్ (4/36), సునీల్ కుమార్ (4/27) అకస్మాత్తుగా మ్యాచ్‌ను మలుపు తిప్పి తమ జట్టును తొలి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు తీసుకెళ్లారు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ 99 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read:Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
జమ్మూ కాశ్మీర్ జట్టుకు కేవలం 126 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేశారు, నాలుగో రోజు ఇంకా 83 పరుగులు మాత్రమే అవసరం, వంశ్ శర్మ అజేయంగా 43 పరుగులు, అబ్దుల్ సమద్ అజేయంగా 30 పరుగులు చేయడంతో ఈ విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్‌లో కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్ 302 పరుగులకు ముగిసింది. మహమ్మద్ షమీ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులకు 8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ పడగొట్టాడు. బెంగాల్‌పై ఈ విజయంతో, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లోని అతిపెద్ద ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరిన హిమాలయ ప్రాంతం నుండి తొలి జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!