NTV Telugu Site icon

Breaking news: పాక్ లో దర్జాగా తిరుగుతున్న.. జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్..

Masood Azhar

Masood Azhar

జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చనిపోయాడు లేదా విగత జీవిగా మారాడని గతంలో పలు మీడియా సంస్థలు అభివర్ణించాయి. ప్రస్తుతం మసూద్ అజార్ పెళ్లి వేడుకలకు కూడా హాజరవుతున్నాడు. ఇండియా టుడే మీడియా సంస్థ బృందం జేఎమ్‌కి సంబంధించిన మల్టీమీడియా క్లిప్‌ల ఫోరెన్సిక్ విశ్లేషణ నుంచి ఈ సమాచారం బయటపడింది. ఏప్రిల్ 2019 నుంచి మసూద్ అజార్ బహిరంగ కనిపించడం లేదు. ఆ సమయంలో పెషావర్‌లోని తన ఇంట్లో జరిగిన పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

READ MORE: Off The Record : కాంగ్రెస్లోకి అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా.?

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు అతడే మద్దతిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 1 నుంచి మళ్లీ మొదలైన ఉగ్రవాద ఘటనల్లో ఆర్మీ మేజర్‌తో సహా 12 మంది భద్రతా సిబ్బంది, 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 55 మంది గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ అంచనాలు ఈ ప్రధాన దాడుల్లో కొన్నింటిలో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలైన జెఇఎమ్‌ల వైపు మొగ్గు చూపాయి.

READ MORE:Noida: కర్కశులుగా మారిన సహోద్యోగులు.. బ్యాంక్ మహిళా ఉద్యోగి ఆత్మహత్మ

ఐక్యరాజ్యసమితి (UN) మరియు అనేక ఇతర దేశాలచే గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన మసూద్ అజార్ ఇటీవల పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకకు జూన్ 27న హాజరయ్యాడు. కాశ్మీర్ మరియు పాలస్తీనా యొక్క జిహాద్‌లో ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళులు అర్పిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఈ సమావేశంలో మసూద్ అజార్ చేసిన ప్రసంగం క్లిప్‌ను జైష్-ఎ-మహ్మద్‌తో సంబంధం ఉన్న ఛానెల్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేశాయి. ఫిదాయీన్‌లుగా మారాలని కోరుకునే వారికి కూడా పెళ్లి ప్రాముఖ్యతను సూచిస్తూ.. అజహర్ మాట్లాడటం దాంట్లో చూడవచ్చు.