సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ మరియు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా మరియు సునీల్ వంటి తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు.ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల అయింది. మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే విజయం సాధించింది.జైలర్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.జైలర్ సినిమాకు ముందు రజనీకాంత్ వరుస ప్లాప్స్ తో ఎంతగానో ఇబ్బంది పడ్డారు. జైలర్ మూవీతో తిరుగులేని విజయం సాధించాడు. తలైవా అదిరిపోయే కమ్ బ్యాక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ జైలర్ సినిమా చూసి కాలర్ ఎగరేస్తున్నారు. జైలర్ సినిమాతో రజనీకాంత్ ఊహించని విజయం అందుకున్నారు.
జైలర్ సినిమాకు రజనీకాంత్ దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.ఇటీవల నిర్మాత కరుణానిధి మారన్ జైలర్ సినిమాకు భారీ వసూళ్ళు రావడంతో రజనీకాంత్ అదనంగా మరో 100 కోట్ల చెక్ ను అందజేశారు.దీనితో జైలర్ సినిమాకు గాను రజనీకాంత్ 200 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ అందుకుని దేశంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఆర్టిస్ట్ గా నిలిచారు.అయితే ఇంతలా రికార్డ్స్ సృష్టిస్తున్న జైలర్ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది.పలు పైరసీ సైట్లలో ఈ సినిమా దర్శనమిచ్చింది.. దీంతో రజనీ ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలో దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దంటూ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ కూడా జైలర్ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేస్తుంది.అయితే జైలర్ లోని పలు సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. జైలర్ సినిమాను థియేటర్స్ లో విడుదల నాలుగు వారాల తరువాత ఓటీటీలో విడుదల చేయాలనీ భావించారు. కానీ సినిమా పైరసీ అవ్వడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 7 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లేటస్ట్ గా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. థియేటర్స్ లో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న జైలర్ సినిమా ఈ వారం ఓటీటీలో సందదడి చేయనుంది.