Jagga Reddy : మీ దగ్గర ఎమ్మెల్యేలు సీఎంని కలిసే వాళ్ళా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ దగ్గర ఎమ్మెల్యేలు.. సీఎం ని కలిసే వాళ్ళా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్.. హరీష్ దగ్గరికి పోయే వాళ్ళు అని, మీ ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తే సీఎం ని కలుస్తారన్నారు. మల్లారెడ్డి కూడా మా దగ్గరకు రావచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు కదా అని అన్నారు జగ్గారెడ్డి. 20 మంది ఎమ్మెల్యేలు వచ్చి తీరుతారని ఆయన అన్నారు. మా ప్రభుత్వం పడేస్తాం అంటున్నారు మీరు .. అందుకే 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని, మా ప్రభుత్వాన్ని కూల్చడం అంటే… కూలి పోయే కాళేశ్వరం కట్టినట్టు అనుకుంటున్నవా అని ఆయన అన్నారు. నాసిరకం సిమెంట్ తో కట్టినట్టు కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 130 ఏండ్ల పునాది కాంగ్రెస్ ది అని, మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండని ఆయన హెచ్చరించారు. జగ్గారెడ్డి కి పదవులు అవసరం లేదని, నేను కాంగ్రెస్ కి ఆయుధమన్నారు జగ్గారెడ్డి. ఆయుధం కి పదవులు అవసరం లేదని, మీకు పోస్టులు ఉంటేనే లీడర్స్ అని ఆయన మండిపడ్డారు. నాకు బ్యాక్ గ్రౌండ్ లేకుండా లీడర్ అయ్యా.. జగ్గారెడ్డి బ్రాండ్ అని ఆయన అన్నారు. . మీలెక్క ఎవరో పేరు చెప్పి నాయకుడిని కాలేదన్నారు జగ్గారెడ్డి. అంతర్యుద్ధం మా దగ్గర కాదు.. మీ పార్టీలో జరిగి తీరుతుందని, మీ పార్టీ లో కేసీఆర్ కి వెనక నుండి గడ్డపార గుచ్చాడానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడన్నారు.
రెండు నెలల్లో 15 కోట్ల మంది మహిళలు rtc లో తిరిగారన్నారు. 535 కోట్లు మహిళల ఉచిత ప్రయాణం కోసం ఖర్చు చేసిందని, మాతో యుద్ధం కి రావడానికి ముందు ముస్లిం లకు ఇస్తాం అన్న 12 శాతం రిసేర్వేషన్ ఇచ్చారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎస్టీల రిజర్వేషన్లు ఏమైందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదన్నారు. దానిమీద రాజకీయ దాడి చేస్తామన్నారు. మేము ఊరుకుంటామా.. మేము చేస్తుంటే బురద జల్లుతున్నారన్నారు. మీరు చేయని పనుల పై మేము కూడా నిలదీస్తామన్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా నిలదిస్తారన్నారు. ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని బీఆర్ఎస్ అంటుందన్నారు. రాజకీయంగా మీరు మాకు నేర్పిన విద్య అని, మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నామన్నారు. ప్రోటోకాల్ లో మీరు వేసిన దారిలోనే మేము.. మీరు 9 ఏండ్లు మాకు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టామన్నారు. మీ అంత మూర్ఖులం కాదు.. మీరు మమ్మల్ని పోలీసులతో గడ్డపార తో పొడిచినట్టు పొడవం.. సూదితో పొడుస్తాం.. . కాంగ్రెస్ కి ఎంత చేత నవుతుందో మీరే చూస్తారు.. ప్రశాంత్ రెడ్డి కి ఏం తెలుసు.. కేసీఆర్ రాసిన స్క్రిప్టు చడవడమే కదా..? రేవంత్ కి చెప్తున్నా.. బీజేపీ వాళ్ళు.. బీఆర్ఎస్ కి ఏదో ఒకటి చేయండి అని లేపుతారు.. మా జాగ్రత్తలు మాకు ఉంటాయన్నారు జగ్గారెడ్డి.
Also Read
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్‌కు తిరుగులేదు..
తాజావార్తలు
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
-
Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!
-
Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
-
BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?