NTV Telugu Site icon

MLA Jyothula Chanti Babu: జనసేన వైపు వైసీపీ ఎమ్మెల్యే చూపు..! పవన్‌తో భేటీ..

Jyothula Chanti Babu

Jyothula Chanti Babu

MLA Jyothula Chanti Babu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఆయన సమావేశం అయినట్టు సమాచారం.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్‌ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. కానీ, జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను హోల్డ్‌లో పెట్టిందట.. అయితే, ఆ తర్వాత వెంటనే జనసేన పార్టీలోకి టచ్‌లోకి వెళ్లారట.. మరోసారి జగ్గంపేట నుంచి బరిలోకి దిగాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. జనసేనలో చేరైనా పోటీ చేయాలని భావనతో.. పవన్‌ కల్యాణ్‌తో రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో గంటకు పైగా చర్చలు జరిపినట్టు సమాచారం.

Read Also: Astrology: డిసెంబర్ 30, శనివారం దినఫలాలు

ఇక, జగ్గంపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి.. ఆ స్థానం నుంచి మాజీ మంత్రి తోట నరసింహాన్ని బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై జ్యోతుల చంటిబాబుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందట వైసీపీ.. కానీ, మరోసారి ఎన్నికల బరిలో దిగాలనే యోచనతో ఉన్న చంటిబాబు.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయడం.. అక్కడ జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో.. జనసేనాతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.. అయితే, 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేటలో చంటిబాబు.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కాగా, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పులు కాకరేపుతోన్న విషయం విదితమే.

Show comments