NTV Telugu Site icon

Thota Narasimham: అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్‌ సీఎం కావాలి..

Thota Narasimham

Thota Narasimham

Thota Narasimham: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారంలో వేగం పెంచారు. గండేపల్లి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల వారీగా పర్యటనలు చేసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు.. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం కావాలని అన్నారు. భారీ బైక్ ర్యాలీతో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తోట నరసింహంకు స్వాగతం పలికారు

జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహంకు మద్దతుగా కూతురు ప్రసూన, కోడలు శ్రీనిధి గోకవరం మండలం కొత్తపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు… తోట నరసింహంకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు..గడప గడపకి తిరుగుతూ మహిళలను పలకరించారు. పథకాలు అన్ని అందుతున్నాయా.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జగ్గంపేట వైసీపీకి కంచుకోట అని.. నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో నరసింహం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని.. తిరిగి తోట నరసింహంకు అవకాశం ఇస్తే మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని అన్నారు.