Jagga Reddy : రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీఐఆర్ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రద్దు చేసిన ఐటీఐఆర్ ని తెప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి.. సంజయ్ లదే అని జగ్గారెడ్డి అన్నారు. రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండని, చేరికల అంశం సీఎం పరిధిలోనిదన్నారు. నా పరిధికి మించి స్పందించను..రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పన్నారు. ఐటీఐఆర్ upa ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందని, తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు జగ్గారెడ్డి. కానీ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని, రద్దు కాకుండా అడ్డుకోలేక పోయారు కిషన్ రెడ్డి..సంజయ్ అని ఆయన అన్నారు. ఎన్డీఏ సర్కార్ ఐటీఐఆర్ రద్దు చేస్తే చర్చ లేకుండా పోయిందని, రెచ్చగొట్టి ప్రసంగాలు తప్పితే.. ఉద్యోగాల చర్చ లేదన్నారు.
అంతేకాకుండా..’యువత కూడా.. ఉద్యోగాలు ఇవ్వలేదనే దానిమీద కంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీ నేతలు గుడికి వెళ్లి దీపం కూడా పెట్టరు కానీ.. గుళ్లు..గోపురాలు చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ITIR తో15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయింది. 15 లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరం అయ్యాయి. జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ అంటారు కానీ.. బతకానికి అక్కరకు వచ్చే ITIR గురించి మాత్రం యువత పట్టించుకోరు. హైదరాబాద్ గడ్డ.. సేఫ్టీకి అడ్డా.. iTIR కి అనువైన ప్రాంతం అనే సోనియాగాంధీ మంజూరు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. సంజయ్ లకు డిమాండ్. ITIR ని తక్షణమే మంజూరు చేయించాలి. బండి సంజయ్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టగానే.. ఐటీఐఆర్ తెస్తా అని అంటే బాగుండేది..భాగ్యలక్ష్మి అమ్మవారిని బంగారు దేవాలయం చేస్తా అన్నాడు. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టు..సెంటిమెంట్ తో రెచ్చగొట్టడం మానుకో. iTIR తెచ్చే వరకు కేంద్ర మంత్రులకు గుర్తు చేస్తూనే ఉంటా..కార్యాచరణ ప్రకటిస్తాం. చేరికల అంశం సీఎం పరిధిలోనిది. శాసన సభ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకొను. రాజకీయ వ్యవహారాల్లో నేను ఓ పరిధి విధించుకున్న. 14 నెలల కింద రాహుల్ గాంధీ నాకు ఓ మాట చెప్పారు. నికేదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని అన్నారు.. ఆయన మాట జవదాటను. నాలో ఎన్ని ఆలోచనలు ఉన్నా.. మౌనంగా నే ఉంటా.‘ అని జగ్గారెడ్డి అన్నారు.
Also Read
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!