టాలీవుడ్ ఫ్యామిలీ సీనియర్ హీరోలో జగపతి బాబు ఒకరు. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా ముఖ్యపాత్రలో నటిస్తూ.. విలన్ గా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇక అందరి హీరోలతో పోల్చితే జగపతి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అటు సినిమాల్లో అయినా, ఇటు పర్సనల్ లైఫ్ లో అయినా ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అయితే తాజాగా తన రెండో కూతురి పెళ్లి జరిగిపోయిందంటూ ఆయన పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఏంటి, జగ్గు భాయ్ అంత సైలెంట్ గా పెళ్లి కానిచ్చేశారా? అని అందరూ ఆశ్చర్యపోయే లోపే అసలు విషయం బయటపెట్టి షాకిచ్చారు.
Also Read : Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!
జగపతి బాబు తన సోషల్ మీడియాలో “ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్” అంటూ ఒక వీడియో షేర్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి అంటే హడావిడి మామూలుగా ఉండదు, కానీ ఆయన ఇంత సింపుల్ గా చెప్పేసరికి ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే కాసేపటికే క్లారిటీ వచ్చింది.. అది నిజమైన పెళ్లి వీడియో కాదు, కంప్లీట్ గా ఏఐ (AI) టెక్నాలజీతో క్రియేట్ చేసిన వీడియో. టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా మారిందో చూపిస్తూనే, తన ఫాలోవర్లను సరదాగా ఆట పట్టించడానికి ఆయన ఈ ప్లాన్ వేశారట. నిజానికి జగపతి బాబు తన పిల్లల విషయంలో చాలా ఓపెన్ గా ఉంటారు. తన రెండో కూతురికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అది తన వ్యక్తిగత నిర్ణయమని గతంలోనే ఆయన చెప్పారు. “పిల్లలకి ఏది నచ్చితే అదే చేయనిస్తాను, పెళ్లి విషయంలో నేను అస్సలు ఫోర్స్ చేయను” అని చెప్పి రియల్ హీరో అనిపించుకున్నారు. మొత్తానికి ఈ ఏఐ వీడియోతో జగ్గు భాయ్ అందరినీ ఒక ఆట ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.