NTV Telugu Site icon

Jagadish Reddy : విద్యుత్ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

Jagadish

Jagadish

హనుమకొండలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ 2023 నూతన సంవత్సర డైరీ ని మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. అయితే… ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. 2001 కేసిఆర్ ఉద్యమం చెయ్యక పోతే ఈ రోజున 24 గంటలు వచ్చేది కాదన్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు.
Also Read : Justice S Abdul Nazeer: సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. అయోధ్య వివాదంపై తీర్పు

కేవలం తెలంగాణ లో విద్యుత్ రంగాన్ని చీకటిలో నెట్టేవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గుజరాత్ లో విద్యుత్ సంక్షోభం వచ్చిందని, దేశంలో ఉన్న నవ రత్నాల కంపెనీ లను ప్రయివేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ ఎంప్లాయిస్ సహకారంతో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. 24 గంటల కరెంట్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులు సమస్యలను సీఎం కేసీఆర్ కేసీఆర్ కు తెలుపుతామన్నారు.
Also Read : Gautham Gambhir: ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడం ముఖ్యం.. ఆటగాళ్లపై పనిభారం తగ్గించాలి