NTV Telugu Site icon

Jagadish Reddy : నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది

Jagadish Reddy

Jagadish Reddy

విద్యుత్ కొనుగోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లాలో మాట్లాడుతూ.. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారని, నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర ఉందని జగదీష్‌ రెడ్డి విమర్శించారు. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తామని, కమీషన్ల విచారణ పేరుతో….. రైతు రుణమాఫీ పై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నమన్నారు జగదీష్‌ రెడ్డి.

  Rangareddy: రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ .. రంగారెడ్డిలో 46 బస్సులపై కేసు నమోదు

ఎన్నికల కోడ్ ముగిసాక హామీల అమలు పై ప్రజలు నిలదీస్తారని కమీషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకులిస్తూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్నీ వరుసగా తెలిపోతున్నాయి. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారని విమర్శించారు. నాలుగు నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారన్నారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంద్నారు.

 Rangareddy: రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ .. రంగారెడ్డిలో 46 బస్సులపై కేసు నమోదు