NTV Telugu Site icon

Jagadish Reddy : బండి సంజయ్ అజ్ఞానంతో అబద్దాలు మాట్లాడుతున్నాడు

Jagadish Reddy

Jagadish Reddy

మోటార్లకీ మీటర్లు పెడతాం, రావలసిన రుణాలు అందించండని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, ఉచితాలపై, మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్రం, బీజేపీ దొంగాట ఆడుంతుందని ఆయన మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెట్టం అని అసెంబ్లీలోనే చెప్పామని, అబద్దాలు ఆడే నాయకులను అడ్డంపెట్టి అబద్దాలు చెప్పిస్తోంది బీజేపీ అని ఆయన విమర్శించారు. దమ్ముంటే బండి సంజయ్ చెప్పే మాటలను కేంద్ర విద్యుత్ శాఖమంత్రి చెప్పాలని ఆయన అన్నారు.

Also Read : Buggana Rajendranath Reddy: ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే టార్గెట్‌.. 20,000 కొత్త ఎంఎస్ఎంఈలు..

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు ఎక్కువిస్తామని కేంద్రం చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘మోటార్లకు మీటర్లు ఎట్టిపరిస్థితుల్లో పెట్టమని అసెంబ్లీ సాక్షిగా చెప్పాం. అసెంబ్లీలో మేము మాట్లాడింది అబద్ధమైతే బీజేపీ సభ్యులు సభా హక్కుల నోటీస్ ఎందుకు ఇవ్వడంలేదు. బండి సంజయ్ అజ్ఞానంతో అబద్దాలు మాట్లాడుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ కోతల పై మాట్లాడని వారు తెలంగాణ పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. దుర్మార్గంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విదేశీ బొగ్గు అంటగడుతున్నారు.

Also Read : Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్‌.. 35 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

యూనిట్ 50 రూపాయలకు అమ్ముకోమనడం ప్రజల పై కక్ష్య సాధించడమే. యూనిట్ 50 రూపాయలకు అమ్మితే సామాన్యుల పైనే భారం పడుతుంది. ఆదానీకి లాభం చేకూర్చడం కోసమే విదేశీ బొగ్గు నిబంధన తెచ్చారు. విదేశీ బొగ్గు అంటగట్టడం దేశ ద్రోహమే. 3600 రూపాయలకు టన్ను బొగ్గు సింగరేణిలో దొరుకుతుండగా విదేశీ బొగ్గు వల్ల ఎవరికి లాభం ప్రజలు అర్ధం చేసుకోవాలి. మెడ మీద పై కత్తి పెట్టి విదేశీ బొగ్గు అంటగట్టడంలో మతలబు ఏమిటి. మోడీ కి ఆదానికే ఆ మతలబు తెలియాలి. బీజేపీ ఎం చేసినా దేశభక్తి అవుతుందనుకుంటే పొరపాటే. మోటార్లకు మీటర్లు బిగిస్తామని ఎప్పుడూ చెప్పలేదు. అలా చెప్పి ఉంటే తెలంగాణాకు రావలసిన 30 వేల కోట్ల రుణం ఎందుకు ఆపారో బీజేపీ చెప్పాలి. బండి సంజయ్ నిజమైన ఎంపీ అయితే తెలంగాణాకు రావలసిన రుణాల పై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలి. దేశ ప్రజలకు కళ్ళకు గంతల్లీ కట్టి బీజేపీ పాలన సాగిస్తుంది. మోడీ కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి దేశ ప్రజలు సరైన సమయంలో బీజేపీకి బుద్ధి చెబుతారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.