Nava Sandeep Arrest: ప్రేమ పేరుతో యువతికి మోసం.. జబర్దస్త్ కమెడియన్ సందీప్ అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhuranagar Police Arrested Jabardasth Artist Nava Sandeep: జబర్దస్త్ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్ అరెస్ట్ అయ్యాడు. మధురానగర్ పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని వంచించి.. లైంగికంగా వాడుకున్న ఆరోపణలపై సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఇచ్చిన పిర్యాదు మేరకే సందీప్ అరెస్ట్ అయ్యాడు. ప్రేమ పేరుతో సందీప్ తనను మోసం చేశాడంటూ మధురానగర్ పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే.
2018లో ఓ యువతితో జబర్దస్త్ కమెడియన్ నవ సందీప్ పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో ప్రతిరోజు వాట్సాప్ చాటింగ్ చేసేవాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. సందీప్ ఆ యువతిని ఊరి నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు. సందీప్‌ను నమ్మిన ఆమె హైదరాబాద్ వచ్చి షేక్‌పేటలోని ఓ హాస్టల్‌లో నాలుగేళ్లుగా ఉంటోంది. త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సందీప్ తన కోరిక తీర్చుకున్నాడు.
Also Read
యువతి పెళ్లి ప్రస్తావన తేగానే నవ సందీప్ ముఖం చాటేశాడు. ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు. చివరకు తాను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి.. మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి సందీప్‌ను అరెస్ట్ చేశారు. సందీప్ గోల్కొండ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Varalakshmi Vratham 2023: వరాలనొసగే ‘వరలక్ష్మీ వ్రతం’ పూజా విధానం.. మీ భక్తి టీవీలో లైవ్‌లో చూడండి!
పాటలతో పాటు కామెడీతో నవ సందీప్ తనదైన స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షోతో పాటు పలు టీవీ షోలలోనూ సందీప్ కనిపించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ వంటి షోలలోనూ పాల్గొన్నాడు. సందీప్ ఓ అమ్మాయిని మోసం చేశాడని తెలిసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!