టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇప్పుడు మూవీ లవర్స్ ఫోకస్ అంతా సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 పైనే ఉంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2022 ఆగస్టు చిత్రీకరణ షురూ చేసుకున్న ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 2023నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కానీ ఈ సినిమా విడుదల విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. పలు కారణాలతో విడుదల తేదీ మార్చి 2023 నుంచి ఏకంగా నవంబర్ 2023కి మారిపోయింది. ఈ నెలలోనైనా థియేటర్లలో టిల్లు సందడి ఉంటుందని అంతా అనుకుంటే.. మళ్లీ ఆ తేదీ కాస్తా 2024 ఫిబ్రవరి 9కి మారిపోయింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదా పడింది.. దీనికి కారణం రవితేజ నటిస్తోన్న ఈగల్ సినిమానే. ముందుగా ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం ఈగల్‌ను జనవరి 13న విడుదల చేయాల్సింది.కానీ సంక్రాంతికి వరుస సినిమాలున్న నేపథ్యంలో ఆదాయంపై ప్రభావం పడకూదనే ఉద్దేశంతో నిర్మాతలు ఈగల్ సినిమాను టిల్లు స్క్వేర్ డేట్‌కు మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో సిద్దు జొన్నల గడ్డ సినిమాకు మరోసారి వాయిదా కష్టం షురూ అయ్యింది.తాజా పరిణామాల నేపథ్యంలో టిల్లు స్క్వేర్‌ను మరో తేదీన విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరి టిల్లు స్క్వేర్ కొత్త డేట్ ఎప్పుడనే దానిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.డీజే టిల్లు తో సిద్దు జొన్నల గడ్డ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఆశలు అన్నీ టిల్లు స్క్వేర్ మీదే..ఈ సినిమా లో సిద్దూ జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఒకటి ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అవుతోంది. సిద్దు జొన్నల గడ్డ ఈ సారి టిల్లు స్క్వేర్ లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నట్టు తెలుస్తుంది.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్ మరియు ప్రణీత్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.