Italy Govt: పాఠశాలలో బురఖా, నిఖాబ్ నిషేధం.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ పార్లమెంట్ పాఠశాలల్లో వివాదాస్పద విద్యా సంస్కరణల బిల్లుకు తుది ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు విద్యార్థులు ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖా, నిఖాబ్ వంటి వస్త్రాలను ధరించడంపై నిషేధం విధించారు. గుర్తింపు తెలియకుండా ముఖాన్ని కప్పుకునే ఏ వస్త్రాన్ని అయినా పాఠశాలల్లో అనుమతించరు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1,000 యూరోల (సుమారు 1,100 అమెరికన్ డాలర్లు) వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థి మైనర్ అయితే, ఆ జరిమానా చెల్లించే బాధ్యత వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై ఉంటుంది.
అంతేకాకుండా.. మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ మూలాలున్న విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేస్తూ ఈ చట్టంలో మరో కీలక నిబంధనను చేర్చారు. అయితే.. ఇప్పటికే ఇటాలియన్ భాషపై తగినంత పట్టు సాధించిన విదేశీ విద్యార్థులకు ఈ 30 శాతం పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు. విదేశీ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఇటాలియన్ భాషా కోర్సులను కూడా ప్రభుత్వం ఇందులో భాగంగా ప్రవేశపెట్టింది. నవంబర్ 20న సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు, నవంబర్ 26న దిగువ సభ అయిన ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో 142 ఓట్ల అనుకూలతతో ఆమోదం పొందింది.
Also Read
- Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
- Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
- Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
- Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం 2026-2027 విద్యా సంవత్సరాన్ని సజావుగా ప్రారంభించడంతో పాటు విదేశీ విద్యార్థుల ఏకీకరణను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విస్తృత విద్యా సంస్కరణలను తీసుకువచ్చింది. అయితే, ఈ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ముస్లిం విద్యార్థులు, విదేశీ కుటుంబాలపై వివక్షను ప్రోత్సహించేలా ఉందని, మతపరమైన స్వేచ్ఛను హరిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు “పాఠశాలలో ఎవరూ విదేశీయులు కారు” అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఇటలీ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించకుండా, విద్యార్థుల మధ్య విభజన తీసుకొచ్చేలా ఈ చట్టం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Italy Govt: పాఠశాలలో బురఖా, నిఖాబ్ నిషేధం.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..
-
AA23: బన్నీ మూవీలో క్రేజీ రైటర్.. లోకీ మాస్టర్ ప్లాన్!
-
Tollywood Movies: స్టార్ హీరోలతో డైరెక్టర్ల ప్రయోగం సక్సెస్.. కానీ?
-
Jr NTR: త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్ సినిమా ఎవరితో?
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!