NTV Telugu Site icon

IT Raids : తెలంగాణలో ఆగని ఐటీ రైడ్స్

It Rides

It Rides

తెలంగాణ వ్యాప్తంగా ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సొసైటి ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చెందిన ఆస్తులపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన 412 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టింది.

Also Read : H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి

సొసైటి పేరు చెప్పి విదేశాల నుంచి సింగిరెడ్డి శౌరెడ్డి నిధులు రాబట్టారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ నిధులన్నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. శౌరెడ్డి, భార్య సునీతారెడ్డి పేర్లపై భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా నిర్థారించింది. అలాగే సొసైటిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగుల పేర్లపైనా ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. వరంగల్, హైదరాబాద్ తో కలిపి మొత్తం 40 చోట్ల ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Also Read : IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!

తెలంగాణలోని క్రిస్టియన్ మిషనరీలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు గత కొన్ని రోజులుగా ప్రత్యేక నజర్ పెట్టారు. అందులో భాగంగానే బాల వికాస్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటిలో తనిఖీలు చేస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు హైదరాబాద్, వరంగల్, మెదక్, కీసర, జీడిమెట్ల సహా 40 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఈడీ, ఐటీ, సీబీఐ పేరుతో నిత్యం ఏదో ఒక చోట సోదాలు జరుగుతునే ఉన్నాయి. క్రమంగా తెలంగాణలో ఈ తనిఖీలతో ప్రభుత్వం కేంద్ర సర్కార్ పై విమర్శలు గుప్పిస్తుంది.