Manjummel Boys : మంజుమ్మెల్ బాయ్స్ పన్ను ఎగవేత స్కాం.. ఇంతకీ ఏమైందంటే ?
- భారీ లాభాలను ఆర్జించిన మంజుమ్మెల్ బాయ్స్
- నిర్మాత ఆఫీసుల పై ఐటీ సోదాలు
- లాభాలు పంచలేదన్న సిరాజ్ అనే వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manjummel Boys : ఈ ఏడాది ఆరంభంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది ‘మంజుమ్మల్ బాయ్స్’. వరల్డ్ వైడ్ ఈ సినిమా దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసిందంటూ మాలీవుడ్ బాక్సాఫీసు వర్గాల సమాచారం. సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్లు లాభాలు వచ్చినట్లుగా టాక్ వినిపించింది. సినిమా విడుదల అయిన తర్వాత ఒక్కొక్కటిగా వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి ఈ సినిమా నిర్మాణంలో తాను భాగస్వామినే అంటూ, కానీ తనకు రావాల్సిన లాభాల వాటాను ఇవ్వడం లేదని కోర్టును ఆశ్రయించాడు.
Read Also:AP Capital Region: రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు.. ఎవరికి ఎంతంటే..?
Also Read
ఈ సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేరళ అరూర్‌కు చెందిన సిరాజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో ఎర్నాకులం సబ్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. తాను సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా డివిడెండ్, పెట్టుబడి కూడా ఇవ్వలేదని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సబ్ కోర్టు జడ్జి సునీల్ వర్కి ఈ స్పీమా నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్, దాని భాగస్వామి షాన్ ఆంటోనీ 40 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. సిరాజ్ వలియతార హమీద్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. సినిమా నిర్మాణానికి 7 కోట్లు ఖర్చు చేశారన్నారు. నిర్మాతలు 40 శాతం లాభాల వాటా ఇస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నారని, ఆపై లాభం లేదా పెట్టుబడి చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also:Adibatla : వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం.. లేడీ వాయిస్‌తో ట్రాప్..!
మంజుమ్మెల్ బాయ్స్ ప్రొడ్యూసర్లకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్మాతలు మినిమం ట్యాక్స్ సైతం చెల్లించలేదంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా చిత్ర నిర్మాత ఆఫీస్‌లపై ఐటీ అధికారులు దాడులు చేసింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఈ సినిమా నిర్మాణ సంస్థ ఆఫీస్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లుగా మలయాళ మీడియాలో వార్త కథనాలు వినిపిస్తున్నాయి. నిర్మాతల ఆఫీస్‌లను తనికీలు చేసిన ఐటీ అధికారులు ఏం గుర్తించారు అనే విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ నిర్మాతలు పెద్ద మొత్తంలో పన్ను ఎగవేశారంటూ ఐటీ అధికారులు గుర్తించారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?