తెలంగాణలో కేంద్ర సంస్థలు దాడుల రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌పై ఈడీ దాడుల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో రెండున్నర రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అయితే.. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు ఐటీ అధికారులు.
Also Read : PhonePe Wonderful Decision: ఫోన్‌పే అద్భుత నిర్ణయం.. ఇక, అందరికీ యాక్టివేషన్..
ఇదే సమయంలో కుమారుడిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు అనుమతించకపోవడంతో ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అయితే.. రెండున్నర రోజుల ఐటీ అధికారుల తనిఖీల అనంతరం మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. తాజాగా మల్లారెడ్డి ఫిర్యాదుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఐటీ అధికారులు.
Also Read : IND Vs NZ: లాథమ్ భారీ సెంచరీ.. తొలి వన్డేలో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ
మల్లారెడ్డి తీరుపై మండిపడ్డ ఐటీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విధులకు మల్లారెడ్డి అటంకం కలింగించారని లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై మల్లారెడ్డి ఇచ్చిన కంప్లైట్‌ను కొట్టివేయాలని పిటిషన్‌లో ఐటీ అధికారులు హైకోర్టును కోరారు. అయితే.. ఐటీ అధికారులు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించనుంది.
