క్రికెట్‌ను అధికారికంగా ఒలింపిక్స్‌లో భాగం చేసిన విషయం తెలిసిందే. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది. 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు మరోసారి ఒలింపిక్స్‌లో చోటు దక్కింది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో ఆడటం చాలా కష్టమే.
వృద్ధాప్యం కారణంగా.. లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడే క్రికెట్‌లో చాలా మంది స్టార్ ఇండియన్ క్రికెటర్లు పాల్గొనలేరు. 2028 నాటికి.. చాలా మంది ఇండియా ఆటగాళ్ల వయస్సు రిటైర్మెంట్ లేదా రిటైర్మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత స్టార్ ఆటగాళ్లు ఆడటం చాలా కష్టం. ప్రస్తుతం.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 సంవత్సరాలు ఉండగా.. 2028 ఒలింపిక్స్ నాటికి అతని వయస్సు 41 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం కింగ్ కోహ్లీ వయసు 34 ఏళ్లు కాగా.. 2028 ఒలింపిక్స్ నాటికి అతడి వయసు 38 ఏళ్లు కావడంతో అతడికి కూడా ఆడే అవకాశాలు తక్కువే.
Mansion 24 Web Series : ఓటీటీ లోకి వచ్చేసిన మాన్షన్ 24 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అంతే కాకుండా.. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా గురించి మాట్లాడినట్లయితే, ప్రస్తుతం సూర్య వయస్సు 33 సంవత్సరాలు. ఒలింపిక్స్ 2028లో 37 సంవత్సరాలు అవుతుంది. రవీంద్ర జడేజాకు ప్రస్తుతం 34 ఏళ్లు కాగా, 2028 ఒలింపిక్స్‌లో అతనికి 38 ఏళ్లు నిండుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఆడటం అంత సులువు కాదు. అయితే జట్టులో చాలా మంది యువ బ్యాట్స్‌మెన్లు కూడా ఉన్నారు. వారు ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలున్నాయి.
Ram Charan : రామ్ చరణ్ కోసం ఇండియా వచ్చిన జపాన్ లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు వైరల్..
ఒలింపిక్స్ 2028 వరకు కొంతమంది స్టార్ ఇండియన్ ప్లేయర్‌ల వయస్సు చూస్తే..
రోహిత్ శర్మ – 41 సంవత్సరాలు
విరాట్ కోహ్లీ – 38 ఏళ్లు
సూర్యకుమార్ యాదవ్ – 37 సంవత్సరాలు
శుభ్‌మన్ గిల్ – 28 సంవత్సరాలు
జస్ప్రీత్ బుమ్రా – 33 సంవత్సరాలు
హార్దిక్ పాండ్యా- 34 ఏళ్లు
కుల్దీప్ యాదవ్ – 32 సంవత్సరాలు
మహ్మద్ సిరాజ్ – 33 సంవత్సరాలు
తిలక్ వర్మ – 24 సంవత్సరాలు
రిషబ్ పంత్ – 30 ఏళ్లు
రవీంద్ర జడేజా – 38 సంవత్సరాలు.