Ram Charan : రామ్ చరణ్ కోసం ఇండియా వచ్చిన జపాన్ లేడీ ఫ్యాన్స్.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అవ్వడంతో పాటు ఆస్కార్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ఈసినిమాలో చరణ్ నటనకు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులు కూడా ఫిదా అయ్యారంటే.. చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిందో తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలకు ఎక్కువగా అభిమానులు ఉండే జపాన్ లో అయితే రామ్ చరణ్ ఎంతటి స్టార్‌డమ్ ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..
అక్కడ చెర్రి కోసం గ్రాండ్ గా వెల్కమ్ కూడా చెప్పారు.. ఒక తెలుగు నటుడికి ఈరేంజ్ లో స్వాగతం దక్కడం అంటే.. అది మామూలు విషయం కాదు. జపాన్ లో రామ్ చరణ్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అప్పట్లో చరణ్ తో కలిసి వారు చేసిన సందడికి సబంధించిన ఫోటోలు, వీడియోలో తెగ వైరల్ అయ్యాయి… ఇదిలా ఉండగా తాజాగా జపాన్ లోని లేడీ ఫ్యాన్స్ రామ్ చరణ్ ను ఒక్క సారి అయినా చూడాలి అని ఏకంగా హైదరాబాద్ కు వచ్చేశారు. తమ అభిమానం జపాన్ లోనే ఆగిపోలేదని.. అవసరం అయితే చరణ్ కోసం అది ఇండియా వరకూ వస్తుంది అని నిరూపించారు..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
తాజాగా జపాన్ లోని చరణ్ ఫ్యాన్స్ చరణ్ ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. సరాసరి చరణ్ ఇంటికి వెళ్లారు.. వారందర్ని సాధరంగా ఆహ్వానించిన రామ్ చరణ్ తన ఇంట్లో కలుసుకున్నారు. వారి తెచ్చిన గిఫ్ట్స్ ని రామ్ చరణ్ కి అందించారు. ఇక వచ్చిన వారందరితో రామ్ చరణ్ ఫోటోలు దిగి ఆనందపరిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆసినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!