Mansion 24 Web Series : ఓటీటీ లోకి వచ్చేసిన మాన్షన్ 24 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24.. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.మాన్షన్ 24 అనేది థ్రిల్లింగ్ హారర్ వెబ్ సిరీస్ గా తెరకేక్కింది. ఇప్పటికే వేణు తొట్టెంపూడి కమ్ బ్యాక్ సిరీస్ అదితి స్ట్రీమ్ చేసిన హాట్‌స్టార్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది..ఈ మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చన జోయిస్, శ్రీమాన్, రావు రమేష్, అమర్ దీప్, నందు, అయ్యప్ప పి శర్మ మరియు రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ను ప్రముఖ యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్ నిర్మించి డైరెక్ట్ చేశాడు. కొన్ని వారాలుగా ఈ సిరీస్ ను మేకర్స్ బాగానే ప్రమోట్ చేస్తున్నారు.ఈ మధ్యే మ్యాన్షన్ 24 ట్రైలర్ కూడా రిలీజైంది.
ఇది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అమృత చుట్టూ తిరిగే కథ. ఆమె కనిపించకుండా పోయిన తన తండ్రి, ఆర్కియాలజిస్ట్ కాళిదాస్ కోసం వెతుకుతూ ఉంటుంది. అతడు సున్నితమైన సమాచారాన్ని తీసుకొని విదేశాలకు పారిపోయాడన్న వార్తలు కూడా వస్తాయి. అయితే తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం కోసం అమృత ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది.అతన్ని వెతుక్కుంటూ ఓ పాడుబడిన మ్యాన్షన్ కు ఆమె వెళ్తుంది. అక్కడ అస్సలు ఏం జరిగింది అనేదే ఈ మ్యాన్షన్ 24 సిరీస్.. ట్రైలర్ ప్రేక్షకులలో ఎంతగానో ఆసక్తి రేపింది. గతంలో దర్శకుడు ఓంకార్ రాజుగారి గది అనే హారర్ మూవీ తెరకేక్కించి మంచి విజయం అందుకున్నాడు. ఆ తరువాత తీసిన రాజుగారి గది 2 సినిమా కూడా మంచి విజయం సాధించింది. కానీ ఆ తరువాత వచ్చిన రాజుగారి గది 3 అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఓంకార్ కాస్త గ్యాప్ ఇచ్చి మాన్షన్ 24 సిరీస్ ను తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి నెలకొంది
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!