NTV Telugu Site icon

IT, Engineering Recruitment: 16, 17 తేదీల్లో బెంగళూరులో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

IT, Engineering Recruitment

IT, Engineering Recruitment

IT, Engineering Recruitment: ఇంజనీరింగ్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సులు చదివిన అభ్యర్థులకు సువర్ణావకాశం. ఎయిర్‌బస్‌ సంస్థ ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో బెంగళూరులో మీట్‌ అండ్‌ గ్రీట్‌ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఏరో ఇండియా-2023 ఎయిర్‌షో సందర్భంగా ఈ నియామక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఆశావహులు ఆ సంస్థ అధికారులను కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

ఎయిర్‌షో జరిగే ప్రాంగణంలోని C హాల్‌లో CR7 పాయింట్ 1 స్టాండ్ వద్ద ఎయిర్‌బస్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారని గమనించగలరు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎయిర్‌బస్‌ ఆఫీసర్లను సంప్రదిస్తే.. వాళ్లు.. తమ సంస్థలోని కెరీర్‌ ఆప్షన్స్‌ గురించి వివరిస్తారు. ఎయిర్‌ఫ్రేమ్‌ డిజైన్‌, ఏవియానిక్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ సిమ్యులేషన్‌, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ మరియు క్యాబిన్‌ ఇంజనీరింగ్‌ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ఎయిర్‌బస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

read more: Loss For Life Insurers: అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్నుల ప్రభావం

ఈ సంస్థ ఇప్పటికే ఇండియాతోపాటు దక్షిణాసియాలో విస్తరిస్తోంది. ఎయిర్‌బస్‌ కంపెనీ కంప్లీట్‌ ప్రొఫైల్‌ గురించి తెలుసుకోవాలన్నా చెప్పేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉంటారు. ఇండియాలో ఇంజనీరింగ్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సులు చదివిన అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులు కెరీర్‌ విషయంలో తమ సంస్థనే టాప్‌ డెస్టినేషన్‌గా ఎంచుకుంటున్నారని ఎయిర్‌బస్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఏసియా హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ సూరజ్‌ ఛెత్రి చెప్పారు.

ఉద్యోగులకు విలువ ఇవ్వటంలో.. వాళ్లను గౌరవంగా చూసుకోవటంలో.. మరియు.. వృత్తిపరంగా సంతృప్తినివ్వటంలో ఒక సంస్థగా ఎయిర్‌బస్‌ ఎన్ని చేయాలో అన్ని చేస్తుందని తెలిపారు. ఇది మా కంపెనీ అని ఉద్యోగులు ఓన్‌ చేసుకునే వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అందుకే.. ఎయిర్‌బస్‌ టాప్‌ ఎంప్లాయర్‌ సర్టిఫికేషన్‌ పొందిందని సూరజ్‌ ఛెత్రి వెల్లడించారు. టాప్‌ ఎంప్లాయర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనే గ్లోబల్‌ ఇండిపెండెంట్‌ అథారిటీ ఈ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిందని అన్నారు.

పీపుల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు హెచ్‌ఆర్‌ పాలసీలను ‘ది బెస్ట్‌’ లెవల్లో అమలుచేసే కంపెనీలను ఈ సంస్థ గుర్తించి సర్టిఫికెట్లను ఇస్తుంది. ఎయిర్‌బస్‌ కంపెనీ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ట్యాలెంట్‌ సెర్చింగ్‌ ఈవెంట్‌ని తలపెట్టింది. విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న ఎయిర్‌బస్‌ సంస్థ.. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవాళ్లను ముఖ్యంగా రెండు కార్యక్రమాల్లో వినియోగించుకోనుంది.

ఇందులో ఒకటి.. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవటం కాగా రెండోది.. భవిష్యత్ వైమానిక అవసరాలకు అనుగుణంగా సిద్ధం కావటం. ఏరో ఇండియా-2023 ఎయిర్‌షోలో ఎయిర్‌బస్‌ కంపెనీ తమ ఉత్పత్తులు, టెక్నాలజీలు, సర్వీసులు, ఇన్నోవేషన్లను ప్రదర్శించనుంది. సంస్థకు సంబంధించిన కమర్షియల్, హెలీకాప్టర్స్‌, డిఫెన్స్‌ మరియు స్పేస్‌ పోర్ట్‌ఫోలియోల్లోని న్యూ-జనరేషన్‌ ట్యాంకర్‌, మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మోడళ్లను సైతం సందర్శకుల కోసం సిద్ధంగా ఉంచనుంది.

విజిటర్లు వివిధ డిజిటల్‌ డిస్‌ప్లేలను వీక్షించనున్నారు. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌, అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్‌ తదితర వినూత్న సామగ్రిని తిలకించొచ్చు. అంటే.. ఏరో ఇండియా-2023 ఎయిర్‌షోకి వెళ్లటం ద్వారా.. ఒకవైపు ఎయిర్‌బస్‌ కంపెనీలోని ఉద్యోగ అవకాశాల గురించి, మరో వైపు.. ఆ సంస్థ ఉత్పత్తుల గురించి ఒకేసారి తెలుసుకోవచ్చన్నమాట. ఇంజనీరింగ్‌ మరియు ఐటీ అభ్యర్థులూ.. డోంట్‌ మిస్‌.. దిస్‌ గోల్డెన్‌ ఛాన్స్‌.

Show comments