Lord Hanuman on Aircraft: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రూపొందించిన ప్రోటోటైప్ ఎయిర్‌క్రాఫ్ట్ పై హనుమంతుడి బొమ్మ వివాదాస్పదం అయింది. అయితే దీనిని ఆ తరువాత తొలగించారు. ఇదిలా ఉంటే బెంగళూర్ లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో చివరి రోజు విమానంపై హనుమాన్ స్టిక్కర్ ప్రత్యక్షం అయింది. దీనిపై హెచ్ఏఎల్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఇటీవల ఏరో షో తొలిరోజు విమానాల ప్రదర్శనలో భాగంగా హెఏఎల్ కొత్తగా రూపొందించిన సూపర్ సోనిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్…
Aero India 2023: అమృత మహోత్సవం నుంచి అమృత కాలంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం మేకిన్ ఇండియా ద్వారా స్థానికంగా ఉత్పత్తులను పెంచుకోవాలని ఆశిస్తోంది. సోవియెట్ కాలం నాటి పరికరాలను ఆధునికీకరించుకోవాలని కృషి చేస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ మేరకు విదేశీ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు కూడా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
IT, Engineering Recruitment: ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు చదివిన అభ్యర్థులకు సువర్ణావకాశం. ఎయిర్‌బస్ సంస్థ ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో బెంగళూరులో మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఏరో ఇండియా-2023 ఎయిర్‌షో సందర్భంగా ఈ నియామక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఆశావహులు ఆ సంస్థ అధికారులను కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
Meat Ban: మాంసం ప్రియులకు కర్ణాటక షాక్ ఇచ్చింది. బెంగళూరులో జరుగుతున్న ‘ఏరో ఇండియా 2023’ ఎగ్జిబిషన్ దృష్ట్యా యలహంగా విమానాశ్రయం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార విక్రయాలపై నిషేధిస్తూ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆదేశించింది.