IT, Engineering Recruitment: ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు చదివిన అభ్యర్థులకు సువర్ణావకాశం. ఎయిర్‌బస్ సంస్థ ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో బెంగళూరులో మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఏరో ఇండియా-2023 ఎయిర్‌షో సందర్భంగా ఈ నియామక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఆశావహులు ఆ సంస్థ అధికారులను కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.