NTV Telugu Site icon

IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..

1

1

ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్లను కేవలం పేటియం, సంబంధిత టీం వెబ్సైట్ లో తప్పించి ఆన్లైన్లో ఎక్కడ దొరకట్లేదు. దింతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ టికెట్ల రూపంలో అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. మన హైదరాబాద్ మహానగరంలో జరిగే మ్యాచ్లకైతే అభిమానులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడంతో టికెట్స్ డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై విమర్శల వెల్లువలు వస్తున్నాయి.

Also read: DC vs SRH: నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ..

ఏప్రిల్ 25 ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తడపడనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి హైదరాబాద్ కు చెందిన ఐటీ వ్యక్తులు ఓ పక్క ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఒక టికెట్ 10000 నుంచి 15000 రూపాయల వరకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సమాచారాన్ని కొందరు పోలీసులకు తెలపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అలా పోలీసులు రైడ్ చేసిన తర్వాత కేసులో ముగ్గురి ఐటి ఉద్యోగులను అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలోని ఇస్నాపూర్ చెందిన మధుబాబు, సైనిక్ పురి డిఫెన్స్ కాలనీకి చెందిన మాధ్యూ రోడ్రిక్స్, కొండాపూర్‌కి చెందిన ఎలంగోవర్ అందరూ కలిసి టికెట్లను బ్లాక్ లో అమ్మడం మొదలుపెట్టారు.

Also read: CM Revanth Reddy: నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

ఇలా ఒక్కొక్క టికెట్ డిమాండ్ ను బట్టి పదివేల రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. వీరి నుంచి సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వాటిని ఎవరెవరికి అమ్మారు.. అసలు టికెట్స్ వారికీ ఎక్కడి నుంచి వచ్చాయి లాంటి విషయాలను లోతుగా కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి డబ్బు అత్యాశకు పోయి అడ్డంగా బుక్కయ్యారు ఐటి ఉద్యోగులు.