NTV Telugu Site icon

IT Sector Jobs : జాబ్ కోసం వెతుకుతున్న స్టూడెంట్స్‎కు షాక్.. క్యాంపస్ హైరింగ్‎కు నో చెప్పిన ఐటీ కంపెనీ

New Project (26)

New Project (26)

IT Sector Jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు షాకింగ్ న్యూస్. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాంపస్ నియామకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ప్రస్తుతం క్యాంపస్‌ హైరింగ్‌ చేయడం లేదని కంపెనీ తెలిపింది. ఇది యువతకు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కంపెనీ గత త్రైమాసికంలో కూడా క్యాంపస్ నియామకాలు చేపట్టలేదు. మరో పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్యాంపస్ నియామక ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.

డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కూడా ఇన్ఫోసిస్ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో పెద్ద క్షీణత నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 6101 మంది తగ్గింది. అంతకుముందు, జూలై – సెప్టెంబర్ మధ్య ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు 7,530 తగ్గారు. డిసెంబర్ 31వరకు కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 322,663గా ఉంది.

Read Also:India- Maldives Row: మాల్దీవులకు తగ్గిన పర్యాటకుల సంఖ్య.. ఇబ్బందుల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ మాట్లాడుతూ.. కంపెనీ ప్రస్తుతం ఫ్లెక్సీ హైరింగ్ మోడల్‌పై పని చేస్తోందని తెలిపారు. అవసరాన్ని బట్టి కొత్త వారిని తీసుకుంటామన్నారు. దీంతో పాటు సంస్థకు ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమైతే.. ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తామని, వ్యక్తులను రిక్రూట్ చేస్తామని చెప్పారు.

ఉద్యోగులను తగ్గించిన టీసీఎస్
ఇన్ఫోసిస్‌లోనే కాకుండా టీసీఎస్‌లో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,680 తగ్గింది. అంతకుముందు చివరి త్రైమాసికంలోనే, ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించాలని కంపెనీని కోరింది. ప్రస్తుతం, డిసెంబర్ 31, 2023 వరకు కంపెనీలో మొత్తం 603,305 మంది పనిచేస్తున్నారు.

Read Also:AV Subba Reddy: టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అవును.. ఆ కోవర్టును నేనే..!

తగ్గిన ఇన్ఫోసిస్ లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ గురువారం విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.6,106 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7.3 శాతం తక్కువ. మునుపటి త్రైమాసికంతో పోల్చితే, అంటే జూలై-సెప్టెంబర్ 2023, కంపెనీ లాభంలో 1.7 శాతం క్షీణత ఉంది. మూడో త్రైమాసికంలో టీసీఎస్ లాభాల్లో పెరుగుదల నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.11,058 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 2 శాతం ఎక్కువ.

ఇన్ఫోసిస్ షేర్లలో భారీ పెరుగుదల
గురువారం ఇన్ఫోసిస్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత, శుక్రవారం కంపెనీ షేర్లు విపరీతమైన పెరుగుదలను చూస్తున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో 7 శాతానికి పైగా పెరుగుదల కనిపించగా, ప్రస్తుతం రూ.107.35 పెరిగి రూ.1601.55కి చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6.63 లక్షల కోట్లకు పెరిగింది.