Osmania University : స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో పరిశోధన, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోసం ప్రముఖ విద్యా సంస్థలు, అంతరిక్ష పరిశోధనా సంస్థల మధ్య కీలక ఒప్పందాలు కుదురుతున్నాయి. తాజాగా, ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి అనుబంధంగా ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, తదుపరి ఐదేళ్లపాటు ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీ, ఓయూ సంయుక్తంగా విద్యా, పరిశోధన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. అంతరిక్ష రంగంలోని తాజా ఆవిష్కరణలకు అనుగుణంగా సామర్థ్యాలను పెంపొందించేందుకు, విద్యార్థులకు ప్రామాణిక శిక్షణ కల్పించేందుకు ఇది పెద్ద మైలురాయి కానుంది.
Miss World 2025: బతుకమ్మ అడిన అందగత్తెలు.. వరంగల్‌లో సుందరీమణుల పర్యటన
ఒప్పందం ప్రకారం, ఓయూ విద్యార్థుల కోసం ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో కొత్త డిగ్రీ మరియు పీజీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి అంతరిక్ష, ఉపగ్రహ పరిశోధనలకు సంబంధించి తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడతాయి. ఓయూ విద్యార్థులకు అదనంగా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మంతనాలు జరిపే అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో అంటార్కిటికాలో ఉన్న శాస్త్రవేత్తలతో లైవ్ ఇంటరాక్షన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా, అంతరిక్ష పరిశోధనలపై అవగాహన పెంచేలా ఈ కార్యక్రమాలు ఉంటాయి.
ఎన్‌ఆర్‌ఎస్సీ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యా సామాగ్రి అభివృద్ధిపై కూడా ఓయూ తోడ్పాటునిస్తుంది. ఉమ్మడి పరిశోధనలు, సంయుక్త సర్టిఫికేట్లతో విద్యార్థులకు బోధనతో పాటు పరిశోధనా అనుభవాన్ని కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Kadapa Mayor: కడప మేయర్‌పై అనర్హత వేటు.. అసలు కారణం ఇదేనా..?
