NTV Telugu Site icon

GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

isro gslv

Collage Maker 26 Mar 2023 09 46 Am 4778

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో ఉండిపోయారంతా. యావత్ భారత దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన క్షణం వచ్చింది. నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లింది రాకెట్. దీంతో శ్రీహరికోట అమితాశ్చర్యంతో నిండిపోయింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3(ఎల్‌వీఎం3–ఎం3) రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకోసం ఇస్రో అధి­కారులు శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. 24.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగం ప్రారంభం అయింది.

Read Also: Sripada Phani Sastry: జెనీవా అసెంబ్లీకి పోటీలో శ్రీపాద ఫణిశాస్త్రి

కౌంట్‌డౌన్‌ ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం నుంచే రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివా­రం ఉదయానికి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగాన్ని నిర్వహించారు. ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శుక్రవారం రాత్రి షార్‌కు చేరుకుని ప్రయోగంపై సమీక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనే శనివారం కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని 19.7 నిమి­షాల్లో పూర్తి చేయనున్నారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్ట­నున్నారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ కలిసి వన్‌వెబ్‌ పేరుతో చేస్తున్న రెండో ప్రయోగం ఇదే కావడం విశేషం.

శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్వీ ఎం-3ప్రయోగిస్తున్న సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు కట్టుదిట్టం చేసి ;తనిఖీలు చేపట్టారు. రెండో ప్రయోగ వేదిక నుంచి వాహక నౌక నింగి లోకి ప్రవేశ పెట్టారు. స్సేస్ సెంటర్ వద్దకు యూకె, అమెరికా, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు చేరుకున్నారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ షార్ కు రెండు రోజుల ముందు చేరుకుని పర్యవేక్షణ చేశారు. ఇది పూర్తి వాణిజ్య పరమైన ప్రయోగం. ఈ ప్రయోగం వీక్షించేందుకు సందర్శకులు భారీగా వాహనాల్లో వచ్చారు. సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ జాతీయ రహదారిపై రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు పట్టించకోకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడ్డారు.

శ్రీహరికోట: రాకెట్ ప్రయోగం విజయవంతమైంది..నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను జిఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ ప్రవేశపెట్టింది..ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం జరిగింది..ఇస్రో సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది..వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెడతాం… దీనికి సంబంధించి పని జరుగుతోంది.. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తాం..జి.ఎస్.ఎల్.వి.మార్క్ 3 రాకెట్ ను మరింత అభివృద్ధి చేస్తాం
-ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్

Read Also:Earthquake: రాజస్థాన్‌లో భూకంపం..