Monsoon Returns: వాతావరణశాఖ గుడ్‌న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
- రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ..
- దేశవ్యాప్తంగా మేఘాలు, ఇస్రో శాటిలైట్ చిత్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Returns: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో మళ్లీ రుతుపవనాలు చురుకుగా మారుతున్నాయని చెప్పింది. జూలై 19న ఇస్రో INSAT-3DR శాటిలైట్ తీసిన చిత్రాల్లో దేశంలో దాదాపు రెండు వంతుల ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి గంగా మైదానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వరకు ఆకాశంలో మేఘాలు విస్తరించాయి.
పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, బెంగాల్ ప్రాంతాల్లో మేఘాల సాంద్రత చాలా ఎక్కువగా ఉందని చిత్రాలు వెల్లడించాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ గాలుల ప్రభావంతో దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో కూడా మేఘాలు ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇస్రో విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు 60-70 శాతం ప్రాంతాలు మేఘావృతమై ఉంది. అయితే, అన్ని ప్రాంతాల్లో ఒకేస్థాయి వర్షం కురవదని నిపుణులు చెబుతున్నారు. అత్యంత ఎత్తులో ఏర్పడిన చల్లని తుఫాను మేఘాలున్న ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని చెప్పింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
INSAT-3DR శాటిలైట్ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ స్థిర కక్ష్య నుంచి ప్రతీ అరగంటకోసారి చిత్రాలు పంపిస్తుంది. ఈ చిత్రాల ఆధారంగా ఐఎండీ వర్షాలను అంచనా వేస్తుంది. శాటిలైట్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మేఘాలపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. మేఘాల పైభాగం ఎంత చట్టా ఉంటే అవి అంత ఎత్తులో, తీవ్రమైన మేఘాలుగా పరిగణిస్తారు. జూలై 19న తీసిన చిత్రాల్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మేఘాల ఉష్ణోగ్రత మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, ఉత్తర భారతదేశంపై రుతుపవన ద్రోణి ఆవరించి ఉండటంతో ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!