Israeli PM: రఫాపై దాడి చేయడం తప్పే.. కానీ, అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు. సాధారణ ప్రజలకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన కూడా ఈ విషాదకర ఘటన జరిగిపోయిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించే వరకు యుద్ధం ఎట్టి పరిస్థితిలో ఆపబోమని చెప్పుకొచ్చారు.
Read Also: Hyderabad: మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.. 8 మందికి అస్వస్థత..
Also Read
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
కాగా, మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారనే సమాచారంతోనే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక, రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలు జారీ చేయగా.. ఇంకో వైపు.. అమెరికా సహా ప్రపంచమంతా యుద్ధం ఆపేయాలని కోరుతున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిగాయి. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు 45 మంది మృతి చెందారు. 60 మందికి గాయాలయ్యాయి.
Read Also: Rajinikanth-Sathyaraj: విభేదాలకు ముగింపు.. కలిసిపోయిన రజనీకాంత్, సత్యరాజ్!
ఇక, ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతో పాటు తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కోరారు.
Outraged by the Israeli strikes that have killed many displaced persons in Rafah.
These operations must stop. There are no safe areas in Rafah for Palestinian civilians.
I call for full respect for international law and an immediate ceasefire.
— Emmanuel Macron (@EmmanuelMacron) May 27, 2024
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!