NTV Telugu Site icon

Israeli PM: రఫాపై దాడి చేయడం తప్పే.. కానీ, అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదు..!

Benjiman

Benjiman

రఫాపై ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు. సాధారణ ప్రజలకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన కూడా ఈ విషాదకర ఘటన జరిగిపోయిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించే వరకు యుద్ధం ఎట్టి పరిస్థితిలో ఆపబోమని చెప్పుకొచ్చారు.

Read Also: Hyderabad: మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.. 8 మందికి అస్వస్థత..

కాగా, మరోవైపు హమాస్‌ కమాండర్లు ఉన్నారనే సమాచారంతోనే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ఇక, రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలు జారీ చేయగా.. ఇంకో వైపు.. అమెరికా సహా ప్రపంచమంతా యుద్ధం ఆపేయాలని కోరుతున్నా ఇజ్రాయెల్‌ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతంలో దాడులు జరిగాయి. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు 45 మంది మృతి చెందారు. 60 మందికి గాయాలయ్యాయి.

Read Also: Rajinikanth-Sathyaraj: విభేదాలకు ముగింపు.. కలిసిపోయిన రజనీకాంత్‌, సత్యరాజ్‌!

ఇక, ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతో పాటు తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ కోరారు.