NTV Telugu Site icon

Ishan Kishan: ఇషాన్ కిషన్ ఊచకోత.. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇది ఎన్నో సెంచరీ తెలుసా?

Ishan Kishan

Ishan Kishan

టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే చాలా అర్ధ సెంచరీలు పూర్తి చేసిన ఇషాన్‌కు ఇది తొలి సెంచరీ. అంతేకాకుండా, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా కూడా అతను నిలిచాడు.

READ MORE: Congerss Minister : సన్న బియ్యం పంపిణీ, నల్లగొండ కాంగ్రెస్ భవిష్యత్‌పై మంత్రుల కీలక ప్రకటన

ఇదిలా ఉండగా.. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ భారీ స్కోర్లు సాధించి ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరును నమోదు చేశారు. హెడ్ పెవిలియన్ చేరిన తర్వాత ఇషాన్ కిషన్.. టాక్ ఆఫ్ ది ఉప్పల్‌గా మారిపోయాడు. ఈ బ్యాటర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి తన విమర్శకుల నోళ్లు మూయించాడు. వరుస సిక్సర్లతో ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత, ఇషాన్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. అక్కడున్న ప్రేక్షకులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఇషాన్ కిషన్ ఊచకోత చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

READ MORE: SRH vs RR: రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్.. సన్‌రైజర్స్ భారీ స్కోర్..