ఇషాన్ కిషన్ అద్బుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్ (MI)కు ఆడిన సమయంలో వెనుకబడిపోయాడని.. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అతనికి కావాల్సిన స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడ్డారు.
టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన…