NO Sanju Samson in Duleep Trophy 2024: సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 కోసం బీసీసీఐ సెలెక్టర్లు బుధవారం నాలుగు జట్లను ప్రకటించారు. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరణ్, శ్రేయస్ అయ్యర్‌లను కెప్టెన్‌లుగా ఎంపిక చేశారు. అయితే దులీప్ ట్రోఫీకి టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్‌లుగా ధ్రువ్ జురెల్, ఎన్ జగదీషన్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లకు అవకాశం ఇచ్చారు.
ఐపీఎల్ 2024లో అదరగొట్టిన సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా.. ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇటీవల శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను సంజూ వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో సంజూని సెలెక్టర్లు పూర్తిగా పక్కనపెట్టారు. సంజూ ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియాలో అతడు మరోసారి చర్చల్లోకి వచ్చాడు. సంజూకు మరోసారి అన్యాయమే జరిగింది’ అని కొందరు.. ‘పాపం సంజూ’ అని మరికొందరు అంటున్నారు.
Also Read: Double Ismart Twitter Review: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్విటర్ రివ్యూ.. పూరి ఈజ్ బ్యాక్!
ఐపీఎల్‌లో ఇరగదీస్తాడు కానీ జాతీయ జట్టులో రాణించడు అనే అపవాదు సంజూ శాంసన్‌కు ఉంది. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకుని.. అంతర్జాతీయ మ్యాచ్‌లలో చేతులెత్తేస్తాడు. తాజాగా కూడా ఇదే జరిగింది. ఇక సంజూ కెరీర్ క్లోజ్ అయినట్టే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారత్ తరపున 30 టీ20లు, 16 వన్డేలు ఆడి.. 1000 పరుగులు కూడా చేయలేదు. ఐపీఎల్‌లో 168 మ్యాచ్‌లలో 4419 రన్స్ చేశాడు.