NTV Telugu Site icon

NBK 109: బాలయ్య ఫాన్స్‌కు ‘దసరా’ డబుల్ ధమాకా!

Nbk 109

Nbk 109

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విషయంలో ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు బాలయ్య బాబు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్యకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో ‘ఎన్బీకె 109’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. కానీ అప్డేట్స్ విషయంలో అభిమానులు కొంచెం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.

వాస్తవానికి దసరాకే ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్‌కు కాస్త్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. రిలీజ్ సంగతి పక్కనబెడితే.. అప్డేట్స్ మాత్రం అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి సాలిడ్ అప్డేట్ రాలేదు. కనీసం సినిమా టైటిల్ కూడా రివీల్ చేయడం లేదు. అయితే ఈసారి మాత్రం ఎన్బీకె 109 టైటిల్ అనౌన్స్మెంట్ రావడం పక్కా అని తెలుస్తోంది. ఈ దసరా కానుకగా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: OPPO Diwali 2024 Offers: ఒప్పో ఫోన్లపై భారీ ఆఫర్స్.. 10 లక్షలు కూడా గెలుచుకోవచ్చు!

అదే జరిగితే బాలయ్య ఫాన్స్‌కు ఈ దసరాకు డబుల్ ధమాకా అనే చెప్పాలి. అయితే మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంక్రాంతి బరిలో బాలయ్య దిగుతున్నాడని వార్తలు వస్తున్నప్పటికీ.. అఫిషీయల్ కన్ఫర్మేషన్ లేదు. మరి దసరాకు టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారేమో చూడాలి.

Show comments