నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK 109’. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఆశించినా.. అది జరగలేదు. దీపావళికి వస్తుందని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విషయంలో ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు బాలయ్య బాబు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్యకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో ‘ఎన్బీకె 109’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ…