Mokshagnya : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కాకుండా నందమూరి అభిమానులకు పండుగలా తన వారసుడు నందమూరి మోక్షజ్ఞని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. హనుమాన్ ఫేం దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆయన మొదటి సినిమా రాబోతుంది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాశం ఉండబోతున్నట్టు సమాచారం. వాస్తవానికి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు బాలయ్య వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది.
Read Also:Mohan Babu: గన్ల సీజ్.. పోలీసుల కీలక ఆదేశాలు
ఇక ఈ సినిమా కాకుండా మరో సెన్సేషనల్ కాంబినేషన్ కూడా నందమూరి జూనియర్ సింహం కోసం సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎవరితోనో కాదు కల్కి 2898 ఎడి అనే సినిమాతో బాక్సాఫీసు వద్ద 1000 కోట్లకి పైగా కలెక్షన్లు అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఉండబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని కూడా కల్కి 2898 ఎడిని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారే నిర్మాణం వహించనున్నట్లుగా టాక్. మరి మొత్తానికి అయితే ఈ కాంబినేషన్ ని మాత్రం ఎవరూ ఊహించి ఉండరనే చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
Read Also:Bengaluru: భార్య వేధింపులు.. ఆఫీస్ పని పూర్తి చేసి సూసైడ్.. కంటతడి పెట్టిస్తున్న ఘటన..