Bigg Boss 7: బిగ్‌బాస్-7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Team India Former Cricketer Venugopal Rao entering as a contestant in Bigg Boss 7: ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగులో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక 7వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఇటీవలే మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి.. సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ఆగష్టు చివరలో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న సీజన్ 7కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా రానున్నారని తెలుస్తోంది. అయితే సీజన్ -7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడని సమాచారం తెలుస్తోంది.
బిగ్‌బాస్‌కి ప్రధాన ఆకర్షణ కంటెస్టెంట్లు అన్న విషయం తెలిసిందే. నేమ్, ఫెమ్ ఉన్న కంటెస్టెంట్లు ఉంటే బిగ్‌బాస్ రేటింగ్స్ కూడా బాగుంటాయి. 6వ సీజన్‌లో సరైన కంటెంస్టెంట్‌లు లేకపోవడంతో ఆ సీజన్ పెద్దగా అభిమానులను మెప్పించలేదనే చెప్పాలి. అందుకే ఈసారి గుర్తింపు ఉన్న వారిని షోలోకి తీసుకురావలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ప్లేయర్ వేణుగోపాల రావును బిగ్‌బాస్ 7లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
Also Read: Commonwealth Games 2026: కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా
టీమిండియా తరుపున ఆడిన కొద్దిమంది తెలుగు క్రికెటర్లలో వేణుగోపాల రావు ఒకరు. భారత్ తరఫున ఆడింది తక్కువ మ్యాచులే అయిన్పటికీ.. ఐపీఎల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న వేణుగోపాల రావు.. ఐపీఎల్ మ్యాచుల సమయంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కామెంటరీ చేస్తూ అభిమానులను అలరిసున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఫాన్స్ పండగ చేసుకోనున్నారు.
ఆంధ్ర ఆటగాడు వేణుగోపాల రావు 2019లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికారు. 2005 జులైలో తొలి వన్డే ఆడిన వేణు.. 2006 మార్చిలో చివరి వన్డే ఆడారు. అతని కెరీర్ పది నెలల వ్యవధిలోనే ముగిసింది. భారత్ తరఫున 16 వన్డేలు ఆడిన వేణుగోపాల రావు 218 రన్స్ చేశారు. అత్యధిక స్కోర్ 61. ఇక ఐపీఎల్‌లో 65 మ్యాచులు ఆడి 985 పరుగులు చేశారు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2008–2014 మధ్య దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడారు.
Also Read: Maruti Wagon R Offer: రూ. 49 వేల డిస్కౌంట్.. 5 లక్షలకే మారుతి వ్యాగనార్! 34 కిమీ మైలేజ్
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!