Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia state Victoria withdraws as host of 2026 Commonwealth Games: కామన్‌వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్ వైదొలిగింది. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్‌వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వమని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు.
మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ మాట్లాడుతూ… ‘కామన్‌వెల్త్ గేమ్స్ 20236 నిర్వహణకు ముందుగా మేము రెండు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్ ($2Aus Billion Dollars) అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏడు ఆస్ట్రేలియ బిలియన్ డాలర్లు ($7Aus Billion Dollars) అయ్యేలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బడ్జెట్ మాకు చాలా పెద్దది. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించడం మావల్ల కాదు. లోటు బడ్జెట్‌తో ఉన్న మాకు గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది’ అని అన్నారు.
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
Also Read: Maruti Wagon R Offer: రూ. 49 వేల డిస్కౌంట్.. 5 లక్షలకే మారుతి వ్యాగనార్! 34 కిమీ మైలేజ్
‘నేను ఈ ఉద్యోగంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. అయితే ఇది వాటిలో ఒకటి కాదు. నిజం చెప్పాలంటే.. ఒక క్రీడా ఈవెంట్ కోసం $7 బిలియన్లు ఖర్చు చేయడం సమంజసం కాదు. గత సంవత్సరం అంచనా వేసిన బడ్జెట్‌తో పోల్చితే.. ఈ ఖర్చు మూడు రెట్లు ఎక్కువ. ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి అంత డబ్బు తేలేం. 2026లో విక్టోరియాలో గేమ్స్ జరగవు. కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలనే మా నిర్ణయాన్ని కామన్వెల్త్ గేమ్స్ అధికారులకు ఇప్పటికే చెప్పాము’ అని డేనియల్ ఆండ్రూస్ తెలిపారు.
ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్‌వెల్త్ గేమ్స్ అన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్‌వెల్త్ గేమ్స్‌కు 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ ఆతిథ్యం ఇవ్వాలి. బడ్జెట్ కారణంగా నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. ఇక 2022లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్ ఆతిథ్యమిచ్చింది. ఈ గేమ్స్‌లో 179 పతకాలతో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. 176 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. 61 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
Also Read: Protein Foods: వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. జిమ్‌కి వెళ్లకుండానే మీ నడుము సన్నబడుతుంది!
Bit of a long one this morning.
You might have heard the news this morning that Victoria will no longer be hosting the 2026 Commonwealth Games.
And I wanted to tell you about the decision.
— Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!