భూ భారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వైనం జనగాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భూ భారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లగొట్టినట్లు సమాచారం. సొమ్ములో కొంత మొత్తమే ప్రభుత్వ ఖజానాలోకి.. మిగతాదంతా సొంత ఖాతలోకే వెళ్తున్నట్లు అనుమానాలు. రూ.9 వేలకు…