Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
- నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు
- జేడీ వాన్స్-ఘాలిబాఫ్ లేకుండానే చర్చలు
- చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ
ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి శనివారం అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈ చర్చలు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ లేకుండానే చర్చలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఆధ్వర్యంలో బృందం పాకిస్థాన్‌కు చేరుకుంది.
ఇక అమెరికా నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ మాత్రమే ఇస్లామాబాద్ వెళ్తున్నట్లుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవట్ పేర్కొన్నారు. చర్చల కోసం ఇరానీయులు సంప్రదించారని.. ముఖాముఖి సంభాషణ కోసం అడిగారని తెలిపారు. చర్చల విషయాలను అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తమ బృందం వివరిస్తారని చెప్పారు.
Also Read
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్‌తో భారత్‌ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్‌కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు తొలి దశ చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చలు గత బుధవారం జరగొచ్చని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. అనూహ్యంగా శనివారం మరోసారి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.
ఇక ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతుండగా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ నగరాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
-
RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
-
RCB vs GT: చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. గుజరాత్‌ను ఉతికేసిన ఆర్‌సీబీ.. పాయింట్ల పట్టికలో టాప్-2కి జంప్!
-
Sree Vishnu : హిట్లు లేకున్నా జోరు తగ్గని శ్రీవిష్ణు..
-
Astrology: ఏప్రిల్ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!