Site icon NTV Telugu

Iran: 168 మంది పిల్లల ప్రాణాలు తీసిన ‘మృగాలు’ వీరే.. అమెరికా అధికారుల పేర్లు బయటపెట్టిన ఇరాన్!

Iran

Iran

Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 175 మంది మరణించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఈ ఘోరానికి కారణం ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులేనని ఇరాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేస్తూ వారి వివరాలను ప్రపంచానికి వెల్లడించింది. భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ఆదివారం నాడు ఈ ఇద్దరు అధికారుల పేర్లను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాయి.

READ ALSO: CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం

అమెరికా యుద్ధనౌక ‘యూఎస్ఎస్ స్ప్రూన్స్’ (USS Spruance)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్.టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ. యార్క్.. మినాబ్ పాఠశాలపై మూడు టోమాహాక్ క్షిపణులను ప్రయోగించాలని వీరిద్దరే ఆదేశించారని, దీనివల్ల 168 మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ పేర్కొంది. “ఈ ఇద్దరు మృగాలను గుర్తుంచుకోండి” అంటూ భారత ఇరాన్ రాయబార కార్యాలయం ‘X’లో తీవ్రస్థాయిలో మండిపడింది. జెనీవాలో జరిగిన అత్యవసర భేటీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి మాట్లాడుతూ.. ఇది పొరపాటున జరిగిన దాడి కాదని, ముందస్తు ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా చేసిన ‘యుద్ధ నేరం’ అని అభివర్ణించారు. ఇరాన్‌పై దాడి మొదలైన మొదటి రోజే విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా బాంబులు వేశారని ఆయన ఆరోపించారు.

మరోవైపు, ఈ దాడిపై అమెరికా భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. ఇది నిఘా లోపం వల్ల జరిగిన పొరపాటుగా అమెరికా సైనిక దర్యాప్తులో తేలింది. లక్ష్యాన్ని గుర్తించడానికి పాతబడిన మ్యాపులను ఉపయోగించడం వల్ల, క్షిపణి అసలు లక్ష్యమైన సైనిక స్థావరానికి బదులుగా సమీపంలోని పాఠశాలపై పడిందని అమెరికా పేర్కొంది. తాము పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ ఆయుధ వ్యవస్థలకే కచ్చితత్వం లేదని, ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం కూడా ఉండి ఉండవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ క్షిపణి దాడి తర్వాత పశ్చిమ ఆసియాలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ – గల్ఫ్ దేశాల్లోని పలు లక్ష్యాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాన్ రాయబార కార్యాలయం షేర్ చేసిన దాడి వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

READ ALSO: Balen Shah: సంచలన నిర్ణయం తీసుకొన్న కొత్త ప్రభుత్వం.. వారికి ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు!

Exit mobile version