Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం
- జూలై 4 నుంచి అంత్యక్రియలు ప్రారంభం
- జూలై 9న అంత్యక్రియలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని అంత్యక్రియలు జూలై 4 నుంచి ప్రారంభమై జూలై 9న ముగియనున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నుంచి భారీ సంఖ్యలో తరలిరానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఖమేనీ అంత్యక్రియలకు మిత్ర దేశాలను ఇరాన్ ఆహ్వానిస్తోంది. భారత్ నుంచి ఇప్పటికే ప్రధాని మోడీని ఆహ్వానించారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా గైర్హాజరవుతున్నారు. ఇక మోడీ తరపున బీహార్ గవర్నర్ వెళ్తున్నారు.
Also Read
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
- Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ఇదిలా ఉండగా ప్రధాని మోడీని కాకుండా భారత్‌లో అధికార-ప్రతిపక్ష పార్టీలను కూడా ఇరాన్ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఇరాన్ ఆహ్వానించింది. వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ విదేశాంగ విభాగం చైర్మన్ సల్మాన్ ఖుర్షీద్‌లకు ఇరాన్ ఆహ్వానం పంపింది. అలాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అనే విషయంపై మల్లికార్జున ఖర్గే ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎవరు ప్రతినిధి బృందంలో పాల్గొనాలనే అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపిన నేపథ్యంలో భారత్ అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఈ బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు బిహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ కూడా భారత ప్రభుత్వ ప్రతినిధిగా అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
ఇక ఖమేనీ అంత్యక్రియల కోసం టెహ్రాన్‌లో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆయన భౌతికకాయాన్ని ముందుగా గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం పలు నగరాల్లో అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంత్యక్రియలకు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇది ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రభుత్వ అంత్యక్రియలుగా నిలిచే అవకాశముంది.
విదేశీ ప్రముఖుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఇరాన్ ఏర్పాటు చేసింది. దాదాపు 30 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో తమ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యూరోపియన్ దేశాలకు మాత్రం ఆహ్వానం పంపలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
జూలై 9న అంత్యక్రియలు పూర్తి
టెహ్రాన్‌లో జరిగే కార్యక్రమాల అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాక్‌లోని నజఫ్, కర్బలా పవిత్ర ప్రాంతాలకు తీసుకెళ్లి.. చివరగా జూలై 9న మష్హద్‌లోని ఇమామ్ రేజా దర్గాలో ఖననం చేయనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొంటారా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!