NTV Telugu Site icon

IPL: క్రికెట్‌ అభిమానులకు ముఖేష్‌ అంబానీ కానుక?

IPL

IPL

IPL: క్రికెట్‌ అభిమానులకు ముఖేష్‌ అంబానీ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్‌షిప్‌ కలిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల డిజిటల్‌ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ 2.7 బిలియన్‌ డాలర్లు చెల్లించింది.

read more: Oil giant Saudi Aramco: కనీవినీ ఎరగని రీతిలో లాభాలను సొంతం చేసుకున్న సంస్థ

తద్వారా ఈ పోటీలో వాల్ట్‌ డిస్నీ కంపెనీని మరియు సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌ను పక్కకు నెట్టేసింది. వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనేది పారామౌంట్‌ గ్లోబల్‌ మరియు రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ల జాయింట్‌ వెంచర్‌. ఈ సంస్థ ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేయటం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలు వాటిని చూసేలా చేయనుంది. ఫలితంగా యాడ్స్‌ రూపంలో ఎక్కువ ఆదాయం పొందాలని భావిస్తోంది.

అయితే.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఉచిత ప్రసారానికి సంబంధించి వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేసిన డిస్నీ సంస్థ ఇదే అదునుగా డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను భారీగా పెంచుకుంది. కానీ.. వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం.

మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లు దాదాపు 8 వారాల పాటు.. అంటే.. సుమారు 2 నెలల దాక కొనసాగుతాయి. ఈ మ్యాచ్‌లను ఈసారి 550 మిలియన్‌ల మంది చూస్తారని వయాకామ్‌18 మీడియా అంచనా వేస్తోంది. ఒక్కో మ్యాచ్‌ 3 గంటల సేపు జరుగుతుంది. ఎన్ని మ్యాచ్‌లైనా.. ఎన్ని సార్లయినా.. ఎంత సేపైనా.. ఏ ఇంటర్నెట్‌ డివైజ్‌లో అయినా ఫ్రీగా చూసే ఛాన్స్‌ ఇవ్వనున్నారు. ఇదిలాఉండగా.. ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లను టీవీల్లో ప్రసారం చేసే హక్కులు మాత్రం డిస్నీకే సొంతమయ్యాయి.

Show comments