Site icon NTV Telugu

Betting : రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు..

Betting

Betting

భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతుంది. మ్యాచ్ స్టార్ట్ చేసే టాస్ దగ్గర నుంచి ఏ బంతికి ఏం జరుగుతుంది అనే దానిపై బెట్టింగ్ కడుతున్నారు. దీంతో బెట్టింగ్ భూతాన్ని తరమి కొట్టేందుకు సైతం పోలీసులు పక్కా ప్లాన్ తో దాడులు చేసి పట్టుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లలో మాత్రం భయం కనపడటం లేదు. అయితే తాజాగా హైదరాబాద్ నగరశివారులో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసుల దాడి చేశారు.

Also Read : Hindenburg row: హిండెన్‌బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్‌తో గౌతమ్ అదానీ సమావేశం

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 12 మంది నిందితులను అరెస్టు చేయగా.. అందులో ఐదుగురు పరారీలో ఉన్నారు. నిందితుల దగ్గర నుంచి 50 లక్షల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల 29 వేలు.. స్మార్ట్ ఫోన్స్ 20, 8 ల్యాప్ టాప్ లు.. 43 కీ ప్యాడ్ ఫోన్స్, 4 టీవీలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోటి 41 లక్షల 52 వేలు రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

Also Read : 26/11 Mumbai Terror Attacks: ముంబై దాడుల నిందితుడిని భారత్‌కు అప్పగించనున్న అమెరికా .. 30 రోజుల్లో కోర్టు నిర్ణయం

కాగా.. మంగళవారం ( 18 Apr 2023 ) నాడు ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ కోసం బెట్టింగ్ పెట్టేందుకు బెట్టింగ్ రాయుళ్లు కాచుకొని ఉన్నారు. భారీ బెట్టింగ్ లు కాసేందుకు రెడీ అయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పందెం రాయుళ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే నగరంలో పలు బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకోగా.. రాజేంద్రనగర్ లోని మైలార్ దేవులపల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ లకు పాల్పడుతన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడిలో రూ. 46 లక్షలను సీజ్ చేశారు. కాగా పరారీలో మరి కొందరు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version