Harry Brook goes to Delhi Capitals for Rs 4 Crore: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, వన్డే ప్రపంచకప్ 2024 హీరో ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. హైదరాబాద్ ప్రాంచైజీ హెడ్‌ను రూ. 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. హెడ్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. హెడ్ కోసం తగ్గేదేలే అన్నట్లు సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రవర్తించారు. ముందునుంచి ఏ మాత్రం ఆలోచించకుండా దూసుకుపోయారు. దాంతో చెన్నై వెనక్కి తగ్గగా.. చివరకు హైదరాబాద్ రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది.
విండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ భారీ ధరను సొంతం చేసుకున్నాడు. పావెల్ కోసం కోల్‌కతా, రాజస్థాన్ ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు రాజస్థాన్ అతడ్ని దక్కించుకుంది. పావెల్ కనీస ధర రూ. కోటి కాగా.. చివరికి రూ. 7.40 కోట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోసోవ్ అన్‌సోల్డ్ అయ్యాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన రోసోవ్‌ను కొనేందుకు ఎవరూ మొగ్గు చూపలేదు. హ్యారీ బ్రూక్‌ను రూ. 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
Also Read: Top Headlines@1PM: టాప్ న్యూస్
ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు. రూ. 2 కోట్ల వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ జోస్యం నిజమైంది. ఇక భారత ప్లేయర్లు మనీశ్ పాండే, కరుణ్ నాయర్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 మినీ వేలంకు చిన్న బ్రేక్ ప్రకటించారు.