Site icon NTV Telugu

Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్

Aakash Chopra

Aakash Chopra

Aakash Chopra: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. మార్చి 28న తొలి మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి పోరు జగరనుంది. ఈ నేపథ్యంలో టీమిండి, కేకేఆర్ మాజీ స్టార్ హైదరాబాద్ టీమ్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కమిన్స్ లేకపోవడం, ఓ ప్రధాన విదేశీ పేసర్ లేకుండానే మ్యాచ్ ప్రారంభించడంపై విశ్లేషణ చేశాడు. SRH టీమ్‌లో బెస్ట్ బౌలర్లు లేరని ఎద్దేవా చేశారు. బ్యాటర్లు కష్టపడి 250 కొట్టినా బౌలర్లు ఈ మ్యాచ్‌ను ఓడగొడతారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. ఎంత కొట్టినా ఓడిపోతారని అభిప్రాయపడ్డాడు.

READ MORE: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

కేకేఆర్ మాజీ స్టార్ ఆకాశ్‌ చోప్రా హైదరాబాద్ జట్టు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం, జాక్ ఎడ్వర్డ్స్ సీజన్ మొత్తానికి దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద దెబ్బ అని అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టు బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. ఒకవేళ బ్యాటర్లు రాణించి 250 పరుగులు చేసినా, ఆ పరుగులను కాపాడుకునే శక్తి ఈ బౌలర్లకు ఉందా? అనేది అనుమానమే. వారు 250 కొట్టినా, ప్రత్యర్థికి కూడా అన్ని పరుగులు సమర్పించుకునేలా ఉన్నారు” అని తీవ్రంగా విమర్శించాడు. విదేశీ పేసర్ ఈషాన్ మలింగ ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తుండటంతో, జట్టులో సరైన విదేశీ ఫాస్ట్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి వంటి భారతీయ బౌలర్లు ఉన్నప్పటికీ, నాణ్యమైన విదేశీ పేసర్ లేకపోవడం వల్ల బ్రైడన్ కార్స్ వంటి వారిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించాడు. రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయపడటం మేనేజ్‌మెంట్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Exit mobile version