IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Records: ఐపీఎల్ 2026లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కు అద్భుత విజయాన్ని అందించింది. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్న లక్నో జట్టు, ఒక దశలో మ్యాచ్‌ను కోల్పోయినట్లే కనిపించినా చివరికి ఊహించని రీతిలో గెలిచింది. ఈ మ్యాచ్‌లో లక్నో ప్లేయర్ ఆయుష్ బాధని 54 పరుగులు చేసి జట్టును గెలుపు వైపు తీసుకవెళ్లాడు. అతను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా KKR వైపు మొగ్గు చూపింది. కానీ అప్పుడు రంగంలోకి దిగిన యువ ఆటగాడు ముకుల్ చౌదరి అనూహ్య ఇన్నింగ్స్ ఆది మ్యాచ్ ను గెలిపించాడు.
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ముకుల్ 27 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి జట్టుకు చివరి బంతి వరకు పోరాడి విజయం అందించాడు. అతనికి మరో వైపు పెద్దగా సపోర్ట్ లేకపోయినా, సింగిల్స్ తీసుకోవడం కంటే బౌండరీలపైనే ఆధారపడి మ్యాచ్‌ను ముగించాడు. చివరి బంతిపై లక్నో జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ అవసరం లేని చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా చివరి బంతిలో ఓడిన జట్టుగా KKR నిలిచింది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 7 ఓటముల రికార్డును కలిగి ఉండగా, KKR ఇప్పుడు దాన్ని దాటి 8 సార్లు చివరి బంతిలో ఓడింది.
చివరి బంతిలో అత్యధిక ఓటములు:
కోల్‌కతా నైట్ రైడర్స్ – 8
ముంబై ఇండియన్స్ – 7
చెన్నై సూపర్ కింగ్స్ – 5
రాజస్థాన్ రాయల్స్ – 4
ఢిల్లీ క్యాపిటల్స్ – 4
పంజాబ్ కింగ్స్ – 4
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 4
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..
ఈ అద్భుత విజయంపై లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందిస్తూ.. ఒక దశలో మ్యాచ్ తమ చేతిలో లేదని భావించామని అన్నారు. అయితే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. “మేము ఓడినా గెలిచినా, మా బౌలింగ్ అద్భుతంగా ఉంది అని చెప్పాలని అనుకున్నా. కానీ ఒక యువ ఆటగాడు బాధ్యత తీసుకుని మ్యాచ్‌ను మార్చడం గొప్ప విషయం” అని లాంగర్ అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!