IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత పోరాటాలు, చివరి బంతి వరకు సస్పెన్స్ మధ్య మరో అంశం ప్రతి మ్యాచ్‌ను ప్రభావితం చేస్తోంది. అదే క్యాచ్ డ్రాప్‌లు. ఫీల్డర్లు జారవిడుస్తున్న సులభమైన క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ సీజన్లో క్యాచ్‌లు వదిలేయడం జట్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక లైఫ్ ఇచ్చిన ఆటగాడు తర్వాత సెంచరీ చేయడం, మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించడం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఫీల్డింగ్ లోపాలు జట్ల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి.
కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌కు కారణమైన డ్రాప్ క్యాచ్
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ దీనికి తాజా ఉదాహరణ. ఢిల్లీ జట్టు 264 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ 152 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మూడో ఓవర్లోనే శశాంక్ సింగ్ సులభమైన క్యాచ్‌ను జారవిడవడంతో రాహుల్‌కు లైఫ్ లభించింది. ఆ తర్వాత అతడు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోరు నమోదు చేశాడు.
Also Read
- LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
- Super Over Stats: సూపర్ ఓవర్లోని రన్స్, వికెట్లను బ్యాట్స్‌మెన్, బౌలర్ ఖాతాలో ఎందుకు కలపరు? ప్రధాన కారణాలు
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
- Mohsin Khan: మోసిన్ ఖాన్ సంచలనం.. కేకేఆర్‌పై విరుచుకుపడి 5 వికెట్ల హాల్‌తో సరికొత్త రికార్డులు
శ్రేయస్ అయ్యర్ రికార్డు ఛేజ్ వెనుక కూడా అదే కారణం
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఫీల్డర్లు మాత్రమే కాదు, ఢిల్లీ జట్టు కూడా అనేక క్యాచ్‌లు వదిలేసింది. మొత్తం ఆరు అవకాశాలను జారవిడిచినట్లు సమాచారం. 15వ ఓవర్లో కరుణ్ నాయర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో శ్రేయస్ అయ్యర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును విజయానికి చేర్చాడు.
పడిపోతున్న ఫీల్డింగ్ ప్రమాణాలు
నిపుణుల ప్రకారం ఇది ఒక్కసారిగా వచ్చిన సమస్య కాదు. గణాంకాలు చూస్తే 2020లో ప్రతి 100 క్యాచ్లలో 85 క్యాచ్‌లు పట్టేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 76కు పడిపోయింది. ప్రస్తుత సీజన్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఒకే రోజులో 17 క్యాచ్‌లు డ్రాప్
ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్‌ల్లో మొత్తం 17 క్యాచ్‌లు జారవిడవడం ఈ సమస్య తీవ్రతను చూపిస్తోంది. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో కూడా సులభమైన అవకాశాలు వదిలేయడంతో 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యమైంది.
అలసట, బిజీ షెడ్యూల్ ప్రధాన కారణాలు
మాజీ ఆటగాళ్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తీరికలేని క్రికెట్ క్యాలెండర్‌ను చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలు, ఫ్రాంచైజీ లీగ్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌ల మధ్య ఆటగాళ్లకు సరైన విశ్రాంతి దొరకడం లేదు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగియడంతో చాలామంది ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉన్నారని అంటున్నారు.
తీవ్రమైన వేడి కూడా ప్రభావం
దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న ఎండలు కూడా ఫీల్డింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఎత్తుగా వచ్చే బంతులను గమనించడం కష్టమవుతోంది. డీహైడ్రేషన్, అలసట, ఏకాగ్రత లోపం కారణంగా తప్పిదాలు పెరుగుతున్నాయి. ఇక, భారత మాజీ ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ, ఫీల్డింగ్ మెరుగుపరచుకోవాలంటే నిరంతర సాధన అవసరమని అన్నారు. కానీ ప్రస్తుత షెడ్యూల్లో ఆటగాళ్లకు అందుకు సమయం దొరకడం లేదని స్పష్టం చేశారు.
చిన్న తప్పిదమే పెద్ద ఫలితం
క్యాచ్ డ్రాప్ అనేది కేవలం ఒక చిన్న తప్పిదంలా కనిపించినా, అది మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. IPL లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో ఒక అవకాశం ఇచ్చినా ప్రత్యర్థి దాన్ని భారీగా మలుచుకుంటున్నాడు. అందుకే ఈ సీజన్లో క్యాచ్‌లు జారవిడవడం జట్లకు కొంపముంచే సమస్యగా మారింది.. ఎన్నో జట్లకు విజయాన్ని అందించింది.. దీంతో, ప్రత్యర్థి జట్లు చతికిలపడిపోయిన పరిస్థితి..
తాజావార్తలు
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!